ఏపీ పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు
ఏపీ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న అన్‌ఎయిడెడ్ సెక్షన్లపై విద్యాశాఖ దృష్టి సారించింది. వాటి వివరాలు సమర్పించాలని ఎయిడెడ్ స్కూళ్లను ఆదేశించింది. ఎయిడెడ్‌లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడి టీచర్లను ప్రైవేట్ సెక్షన్లకు వినియోగిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పలు ఎయిడెడ్ స్కూళ్లకు సమాంతరంగా అన్ ఎయిడెడ్ సెక్షన్లు కూడా నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో విద్యార్థులను అన్‌ఎయిడెడ్‌లో చేర్చుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది.

