మంత్రి, ఎంపీ నివాసాల్లో ఈడీ తనిఖీలు
తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ, ఆయన కుమారుడు, ఎంపీ అరుణ్ నెహ్రూకు సంబంధించిన ఇళ్లతో పాటు చెన్నయ్ 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే మంత్రికి సంబంధించిన ట్రూ వాల్యూ హోమ్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో అవకతవకలు జరిగాయని ఈడీ రెయిడ్ చేసింది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి నెహ్రూ సోదరుడు రవి చంద్రన్ అధినేతగా ఉన్నారు.