Home Page SliderInternational

రష్యా విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం- కూల్చివేసిన భద్రతా సిబ్బంది

మాస్కోలోని వ్నుకోవ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ల విహారం కలకలం రేపింది. మంగళవారం తెల్లవారు జామున ఈ డ్రోన్లను గుర్తించిన భద్రతా దళాలు వాటిని కూల్చివేశాయి. ఇది ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యేనని, పుతిన్‌ను అంతమొందించడానికే ఈ డ్రోన్లను పంపినట్లు రష్యా ఆరోపిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరపడంతో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని, పలు విమానాలను దారి మళ్లించామని విదేశాంగ శాఖ ప్రతినిథి మారియా జఖరోవా పేర్కొన్నారు. ఈ డ్రోన్ల దాడిలో కానీ, కూల్చివేతలో కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. నాలుగు డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పేల్చివేయగా, ఐదో డ్రోన్‌ను ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ కూల్చివేసింది. మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండే ఈ డ్రోన్లు ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరం ఉండగా ఇదెలా సాధ్యమని ఉక్రెయిన్ ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకూ  కీవ్‌పైనే రష్యా 22షహిద్ డ్రోన్లతో దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.