Home Page SliderNational

పౌర్ణమి పూట ఈ దృశ్యం మిస్ కాకండి..

నేడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనులవిందు చేయబోతోంది. ఆకాశంలో పున్నమి చంద్రుడు సూపర్ బ్లూమూన్‌గా కనిపించబోతున్నాడు. ఈ దృశ్యాన్ని ఎవ్వరూ మిస్ కాకుండా వీక్షించండి. సాధారణ స్థాయి కన్నా పెద్ద సైజులో కాంతివంతంగా కనిపించబోతోంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా భారతీయులు రాఖీ పండుగ జరుపుకుంటారు. పౌర్ణమి పూజ చేసుకుంటారు. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయబంధానికి ఈ పండుగ తార్కాణంగా నిలుస్తుంది. ఈ సూపర్ బ్లూమూన్ మన దేశంలో రాత్రి 8 గంటల నుండి రేపు తెల్లవారుజామున 5.32 గంటల వరకూ చూడవచ్చు. ఈ సంవత్సరం ఏర్పడే బ్లూమూన్‌లలో ఇదే మొదటిది. మరో మూడు బ్లూమూన్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 18, అక్టోబరు 17, నవంబర్ 15న కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.