తిరుపతిలో ఈ పొరపాట్లు చేయకండి-మీకు స్వామి ఆశీస్సులు దొరకవు
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎవరికి ఉండదు, ఆ స్వామి వారిని దర్శించుకోవాలని అందరూ కోరి మొక్కులు తీర్చుకుంటారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అంతదూరం వెళ్లిన తర్వాత కొందరు తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొద్దిమంది తిరుపతి యాత్రను విహారయాత్ర (పిక్‌నిక్)లా ఫీల్ అవుతుంటారు. మరికొందరేమో ఇతర మార్గాల్లో దర్శనం చేసుకుంటారు. అలా చేయడం వల్ల దైవానుగ్రహం ఉండదని పెద్దలు చెబుతున్నారు. కొంతమంది క్యూలైన్లలో ఓవర్‌టేక్ చేసి వెళుతుంటారు. తిరుమలలో పూసిన పువ్వులను మహిళలు అలంకరించుకోవడం కూడా నిషిద్ధం.

