Home Page SliderInternational

వరల్డ్‌లో అతిపెద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా?

నేడు శ్రావణ మాస తొలి శనివారం. ఈ రోజు  ప్రపంచంలోని అతిపెద్ద వేంకటేవరస్వామి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈస్ట్ ఆఫ్రికాలోని మారిషస్ దేశంలో 108 అడుగుల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం ఉంది. శ్రీనివాసాచార్య బదరికాశ్రమంలోని హరిహర దేవస్థానంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రారంభ వేడుకలో హెలికాప్టర్ ద్వారా స్వామివారికి పూలాభిషేకం చేయడం విశేషం. అక్కడ నిత్యపూజలు చేస్తూ ఉంటారు.