Home Page SliderTelangana

బల్దియా ఆస్తులను డిజిటలైజేషన్ చేయాలి: మేయర్

హైదరాబాద్: బల్దియా ఆస్తుల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని మేయర్ గద్వాలు విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ అదనపు కమిషనర్లతో ఆమె సమీక్ష జరిపారు. ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కిరాయి వసూలు, లీజ్ గడువు ముగింపు తేదీకి సంబంధించి ముందస్తుగా సంకేతాలు వచ్చే విధంగా ఆన్‌లైన్‌లో సరిచేయాలన్నారు.