Home Page SliderNationalPolitics

ప్రధాని మోదీ నమస్కరించిన ఢిల్లీ బీజేపీ అభ్యర్థి ప్రత్యేకత

దేశరాజధాని ఢిల్లీలో  ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. స్వయంగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక బహిరంగ సభలో ప్రధాని ఒక బీజేపీ అభ్యర్థి కాళ్లకు నమస్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలయ్యింది.  పట్పర్ గంజ్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున  రవీందర్ సింగ్ నేగి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఇదే స్థానం నుండి ఆప్ తరపున యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా కూడా పోటీ చేస్తున్నారు. రవీందర్ ప్రస్తుతం పట్పర్ గంజ్‌లోని వినోద్ నగర్ నుండి కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. మొదట రవీందర్ నేగి ప్రధాని కాళ్లకు నమస్కరించగా, ఆయన వారిస్తూ ముమ్మారు నమస్కరించారు. రవీందర్ నేగి కౌన్సిలర్‌గా అనేక కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. గతంలో ఢిల్లీలో దుకాణాలకు సొంతపేర్లు, హిందువులు దుకాణాలపై కాషాయ జెండా ఎగురవేయాలని సూచించారు. అంతేకాక పండుగలు, నవరాత్రులలో మాంసపు దుకాణాలు మూసివేయాలని కోరారు. అలాగే ఢిల్లీ వరద సమయంలో నీటిలో బోట్లు వేసుకుని తన వార్డ్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇదే స్థానం నుండి ఆయన ఆప్ నేత మనీష్ సిసోడియా చేతిలో కేవలం 2 శాతం ఓట్లతేడాతో ఓడిపోయారు.