బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి..
దావోస్ పర్యటన ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులను భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత తదితర అంశాలను కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆయన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇండోనేషియా ఆరోగ్యశాఖ మంత్రి బుడి గునడి సారికిన్ ను సీఎం చంద్రబాబు కలిసి పలు విషయాలపై చర్చించారు.

