Home Page SliderNationalNews Alert

రానున్న 24 గంటల్లో బిపోర్‌జాయ్‌ తుపాను.. 3 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

Share with

మరో 24 గంటల్లో బిపోర్‌జాయ్‌ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌ జాయ్‌ తుపాను మరింత బలపడి ఉత్తర –ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గుజరాత్‌లోని ప్రముఖ ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేయనున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.