Home Page SliderNational

భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం

Share with

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంబైలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కాగా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు చోట్ల సబ్‌వేల్లోకి కూడా నీరు చేరింది. దీంతో ముంబయిలో జనజీవనం అస్థవ్యస్థం అవుతోంది. అయితే ఈ భారీ వర్షాలు మరి కొన్ని రోజుల వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అంతేకాకుండా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముంబయికి IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.