ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల ఆందోళన
హైదరాబాద్ లాంటి సిటీలలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్రయాణ సర్వీసులు చాలా పాపులర్ అయ్యాయి. అయితే విపరీతమైన ట్రాఫిక్, దూరాలు కారణంగా కొందరు డ్రైవర్లు సరైన సమయానికి కస్టమర్ల వద్దకు చేరలేకపోతున్నారు. దీనితో కస్టమర్లు కొత్త ట్రెండ్ కనిపెట్టారు. రెండు యాప్‌లలో ఒకేసారి రైడ్ బుక్ చేస్తున్నారు. ఏది తక్కువ ధరకు వస్తే అది, లేదా ఏది తొందరగా వస్తే ఆ వాహనం ఎక్కి వెళ్లిపోతున్నారు. దీనివల్ల డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కస్టమర్ల వల్ల తమకు పెట్రోల్ వేస్ట్, టైమ్ వేస్ట్ అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అయితే తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.

