Home Page SliderNationalNews AlertPoliticsTrending Todayviral

షిండేపై కమెడియన్ పేరడీ సాంగ్..మండిపడ్డ శివసేన

మహారాష్ట్ర రాజకీయాలలో మూడు పార్టీల కూటమి పరిపాలనపై పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ది యూనికాంటినెంటల్ క్లబ్‌లో పేరడీ సాంగ్ రూపంలో సెటైర్లు వేశారు. ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను మార్చి, ఏక్‌నాథ్ షిండేపై పాడారు. ఆయనను దేశ ద్రోహిగా వర్ణిస్తూ గతంలో బీజేపీతో కలిసి శివసేన నుండి వెలువడి అధికారం చేజిక్కించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గతంలో బీజేపీ పార్టీ నుండి శివసేన విడిపోయిందని, తర్వాత శివ సేన నుండి శివసేన విడిపోయిందని, ఎన్సీపీ నుండి ఎన్సీపీ విడిపోయిందంటూ సెటైర్లు వేశారు. దీనితో ఈ క్లబ్‌పై దాడి చేసిన శివసేన కార్యకర్తలు కమెడియన్‌ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. మరో వైపు శివసేన నేత ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఈ కమెడియన్ మాటలు నూరుశాతం నిజమని పేర్కొన్నారు. కార్యకర్తలతో ఈ గొడవ షిండేనే చేయిస్తున్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అణగదొక్కడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు.