సోదరుడి కర్మక్రియల్లో సీఎం బాబు
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తన సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. దశదిన కర్మలో హాజరై రామ్మూర్తినాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోదరుడి కుమారులు నారా రోహిత్, నారా గిరీష్ లను పరామర్శించారు. మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దకర్మలో హాజరయ్యారు.

