పెద్దపల్లిలో కారు బీభత్సం ..ఇద్దరు మృతి
పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ఉదయం రంగంపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న అమృత,భాగ్య అనే మహిళలు స్పాట్‌లోనే చనిపోయారు.కారు వారిమీద నుంచి దూసుకెళ్లడంతో శరీరాలు ఛిద్రమయ్యాయి.మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఉదయ్ నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.