కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం..
హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను షిఫ్ట్ కారు ఢీకొట్టింది. అనంతరం మరో కారుని వేగంగా మద్యం బాబులు ఢీకొట్టారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

