పానీపూరి కావాలంటూ పోలీసులకు ఫోన్.
1930 సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నెంబరుకు ఒక బాలుడి నుండి ఫోన్ వచ్చింది. కాకినాడ వద్ద యానాంలో పుదుచ్చేరి పోలీసులు ఈ ఫోన్‌లో బాలుడి డిమాండ్స్ విని ఆశ్చర్యపోయారు. ఏడేళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా అనేకమార్లు ఫోన్ చేసి తనకు చాక్లెట్లు, పానీపూరి కావాలంటూ మారాం చేస్తున్నాడు. అలా అడగకూడదని చెప్పినా వినట్లేదు. చేసేది లేక ఫోన్ నెంబర్ ఆధారంగా బాలుడి ఇంటికి వెళ్లి చూశారు. అతని తల్లిదండ్రులను పిలిచి మాట్లాడగా, బాలుడు అతని తల్లి ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నాడని తెలిసింది. వారిని మందలించి, బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

