Home Page SliderTelangana

BRS పార్టీ పని అయిపోయింది: షబ్బీర్ అలీ

తెలంగాణ: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వువస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? శాసనమండలిలో నా ప్రతిపక్ష హోదా తొలగించలేదా? అని ఫైరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యిందని, కోకాపేటలో ఆ పార్టీకి ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.