Andhra PradeshcrimeHome Page SliderNews Alert

పవన్ కళ్యాణ్ వల్లే వారిద్దరూ మృతి..పవన్‌ను కూడా అరెస్టు చేయాల్సిందే.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా అరెస్టు చేయాల్సిందేనని వైసీపీ అధికార ప్రతినిధి కె. వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన పవన్ బైక్ సైలెన్సర్ల్ తీసి, యువకులు స్టంట్లు చెయ్యాలంటూ చెప్పారని, అందుకే గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి వెళ్లి తిరిగి బైక్‌పై వ‌స్తుండ‌గా మణికంఠ, చరణ్ అనే యువకులు మరణించారని ఆరోపించారు.  రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు త‌ప్పి వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23) అనే వ్య‌క్తి అక్కడికక్కడే మృతి చెందగా చ‌ర‌ణ్ అనే యువ‌కుడు తీవ్రంగా గాయపడి ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుంగా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లే, ఇప్పుడు ఈ కేసులో పవన్ కళ్యాణ్‌ను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్యానించారు.