Home Page SliderNational

తండ్రికి తెలియకుండా బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రేమ పెళ్లికి సిద్దమవుతోంది. ఈ నెల 23న పెళ్లి జరగబోతుండగా తనకు ఆవిషయం తెలియదని ఆమె తండ్రి ఒకప్పటి హీరో శత్రుఘ్నసిన్హా చెప్పడం విశేషం. గత ఏడేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో ఉన్న సోనాక్షి చివరకు తమ పెళ్లికి నిర్ణయించుకున్నారని సమాచారం. వారు వివాహం కోసం జూన్ 23న రిజిష్టర్ చేసుకున్నారని అనంతరం వివాహ సందర్భంగా పార్టీ ఇస్తారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే జహీర్ ఇక్బాల్‌కి బాలీవుడ్‌తో సంబంధం లేదని, అతని తండ్రి ఇక్బాల్ రత్నాసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చాలా సన్నిహితుడని సమాచారం. సోనాక్షి మొదటి సినిమా దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.