ఉత్తరాఖండ్ లో పెను విషాదం…లోయలో పడిన బస్సు…36 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో పెనువిషాదం చోటు చేసుకుంది.గీత్ జాగీర్ నది ఒడ్డున ప్రయాణీస్తున్న బస్సు..అదుపుతప్పి లోయలో పడటంతో 36 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు.మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.చనిపోయిన వారిలో చిన్నారులు,వృద్దులు కూడా ఉన్నారు.అల్మోరా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అక్కడి ప్రభుత్వ సహాయక సిబ్బంది సంబంధిత చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

