అమిత్ షాకు అసదుద్దీన్ ఒవైసీ లేఖ
తెలంగాణా MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ నెల 17న జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని అసదుద్దీన్ లేఖలో కోరారు. సెప్టెంబరు 17 హైదరాబాదు సంస్థానం, భారతదేశంలో విలీనమైన రోజని అసదుద్దీన్ పేర్కొన్నారు. తెలంగాణ సమైక్యతకు హిందువులు ,ముస్లింలు కలిసి పోరాడారని తెలిపారు. ఈ నెల 17న పాతబస్తీలో తిరంగా యాత్ర ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులందరూ హాజరవ్వాలన్నారు. అంతేకాకుండా సీఎం కేసిఆర్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ లేఖ దేశ,తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాశమైంది.
Read more: తెలంగాణాలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం

