HealthHome Page SliderTrending Today

టాయిలెట్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారా..?

కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. టాయిలెట్ లోకి మొబైల్ తీసుకుని వెళ్తారు. ఇక మొబైల్ ను చూస్తూ ఎంత సేపు టాయిలెట్ లో ఉంటారో వాళ్లకే తెలియదు. బాత్రూమ్ కు వెళ్లి టాయిలెట్ సీట్ మీద కూర్చొని న్యూస్ పేపర్లు చదువుతుంటారు. ఈ మధ్య సెల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక కొందరు ఇంట్లో, ఆఫీసుల్లో.. బాత్రూమ్ కు వెళ్లి టాయిలెట్ సీట్ మీద కూర్చొని యూట్యూబ్ వీడియోలు, ఇన్స్ట్ రీల్స్ వంటివి చూస్తుంటారు. కానీ టాయిలెట్ లో 10 నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఉంటే ఈ సమస్యలు రావడం పక్కా అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ లేదా న్యూస్ పేపర్ పట్టుకొని టాయిలెట్ సీట్ మీద ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదంతో పాటు మలద్వారం వద్ద వాపు, నరాలు ఉబ్బడం, మలంలో రక్తం రావడం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ వచ్చే ముప్పు కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. టాయిలెట్ కు వెళ్తే 7 నుంచి 10 నిమిషాల లోపే ముగించుకొని రావాలని.. అక్కడ ఎక్కువ సమయం గడపడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఒకవేళ మలబద్దకం సమస్య ఉంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.