HealthHome Page Slider

మీరు చికాకుగా ఉన్నారా..? అయితే ఇదే చికాకుకు కారణం..!

మనం నిత్యం ఏదో విషయం పట్ల చికాకుకు గురవవుతాం. అసలు చికాకు అనేది మనకు ఎలా వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోపం, టెన్షన్, చిరాకు, ఒత్తిడి, భయం వంటివి ఉన్నప్పుడు శరీరంలోని చెడు హార్మోన్లు మన అవయవాలు చేసే పనిని మారుస్తూ ఉంటాయి. మానసిక స్థితి బాగా లేనప్పుడు శ్వాస నాళాలు సన్నగా మారుతాయి. మనం శ్వాస తీసుకునే సామర్థ్యం మామూలుగా రెండు రెట్లు ఉంటే సగంకి పడిపోతుంది. అంటే ఒక నాళం గుండా మాత్రమే శ్వాస తీసుకుంటుంది. ఇలా శరీరంలో ఆక్సిజన్ తగ్గేసరికి అవలింతలు రావడం ముఖంలో ఫీలింగ్స్ మారిపోతాయి. మనసు బాగా లేకపోవడం వలన రక్తనాళాలలో కూడా వాటి పని చేసే సామర్య్థం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అడ్రినల్ గ్రంధి నుండి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. శరీర క్రియ సరిగా చేయకుండా చేస్తాయి. మనస్సు బాగా లేనప్పుడు ఆలోచనలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇలా జరగడం వలన ముఖ్యమైన విషయాలలో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.