HealthNational

మీరు కూడా గురక సమస్యతో ఉన్నారా ……?

మీరు కూడా గురక సమస్యతో ఉన్నారా ,అయితే ఇంకా ఏ మాత్రం ఆలస్యం చెయ్యాకుండా డాక్టర్ ని కలవండి మీ సమస్య పోయినట్లే. గురక సమస్యతో బాధపడేవారికి నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌లో చికిత్స అందించనున్నారు వైద్యులు. ప్రసుత్త జీవనశైలి మార్పులతో పెరుగుతున్న అబ్సట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యకు చికిత్స అందించేందుకు నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్ సిద్దమవుతుంది. అధిక బరువు, డ్రింక్, సిగరెట్ అలవాట్లు, శ్వాసనాళ్లలో సమస్య గురకకు దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు. దేశం మొత్తం మీద 40 నుంచి 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఒక సర్వే లో రుజువయ్యింది. ఈ సమస్య ఉన్నవారు కొన్నిసార్లు శ్వాస ఆగిపోయి మెలకువ రావడం జరుగుతుంది. మరి కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్ అందక పక్షవాతం బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలిపారు.