Andhra PradeshHome Page Slider

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటుపడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. ముగ్గురు పేర్లతో ప్యానల్ ను పంపించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. డీజీపీని, సీఎస్‌ను మార్చాలని గత కొద్ది రోజులుగా టీడీపీతో సహా కూటమి నేతలు ఈసీని గట్టిగా కోరారు. ఈనెల 13న అసెంబ్లీ ఎన్నికలను ఇటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఈసీ ఆదేశించింది. డీజీపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. అమిత్ షా హిందూపురం పర్యటన తర్వాత డీజీపీపై వేటు పడటం విశేషం.