పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కలతో పార్టీలు షాక్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం ఓటింగ్ పూర్తయ్యిందని చెప్పారు. ఓటింగ్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైతే రేపు, ఎల్లుండి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆయా ఓటర్లు సొంత నియోజకవర్గ పరిధిలోనే ఓట్లు వేయాలని మీనా కోరారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ 3 లక్షల 30 వేల మంది వినియోగించుకున్నారన్నారు. మొత్తం 4 లక్షల 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కొందరికి ఫార్మ్ 12D అందడంలో ఆలస్యమైందన్నారు. ఇప్పటి వరకు ఓటు వేసేందుకు 20 రోజులు ఇచ్చామని, కౌంటింగ్ ముందు రోజు వరకు గడువివ్వలేమన్నారు. కొందరికి ఓటుకు నోటు ఇస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై విచారణ చేస్తామన్నారు. పల్నాడులో హోలోగ్రామ్ పేమెంట్ విషయమై విచారణ చేస్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రెండు పార్టీల మధ్య గందరగోళం నెలకొంది. ఉద్యోగులు భారీగా టీడీపీకి ఓటేస్తారన్న చర్చ నడము, వైసీపీ చాకచక్యంగా వ్యవహరించిందన్న భావన కూడా ఉంది.

