Andhra PradeshHome Page Slider

ఏపీలో 62 వేల మంది వాలంటర్లు రాజీనామా: హైకోర్టుకు నివేదించిన ఈసీ

Share with

ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికలయ్యే వరకు రాజీనామాలు ఆమోదించొద్దని, భారత చైతన్య యువజన పార్టీ రామచంద్రయాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 62 వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఈసీ లాయర్ అవినాష్ దేశాయ్ చెప్పారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామన్నారు ఈసీ న్యాయవాది. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని పిటిషన్ న్యాయవాది ఉమేష్ చంద్ర చెప్పారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ ఎలాంటి నిర్ణయమైన తీసుకునేందుకు ఈసీకి అధికారులున్నాయని ఆయన తెలిపారు. పిటిషనర్ వాదనను విన్న కోర్టు, ఈసీని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పేర్కొంది. వాలంటీర్ల చెప్పినంత మాత్రాన ఓటేసేంత బలహీనంగా ప్రజలు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజీనామా చేసిన వాలంటర్లీను నియంత్రించలేమని ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది.