మరో వైసీపీ నేత అరెస్టు
మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. నేడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా బెంగళూరులో సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, రఘురామ్ మరికొందరి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా, హైకోర్టు నిరాకరించింది. దీనితో నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. నేడు అరెస్టు చేసిన నందిగం సురేశ్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించింది.