Home Page SliderNational

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్, పార్టీకి మాజీ సీఎం రాజీనామా

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఎన్నికలకు నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి , మాజీ ఎంపీ అశోక్ చవాన్ బిజెపితో చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు, బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అశోక్ చవాన్‌కు రాజ్యసభ టికెట్ లభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో భోకర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కలుసుకుని రాజీనామాను అందించారు. బిజెపిలో చేరితే, కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవరా గత నెలలో పార్టీని విడిచిపెట్టి, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తర్వాత మహారాష్ట్రలో ఇది రెండో ఝలక్ అవుతుంది. చవాన్ పార్టీలో చేరుతున్నారా అని గతంలో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అడిగ్గా… మీడియా ద్వారా విన్నానని ఆయన బదులిచ్చారు. కానీ కాంగ్రెస్ నుండి చాలా మంది మంచి నాయకులు బీజేపీకి టచ్‌లో ఉన్నారని చెప్పగలనన్నారు. జనంతో కనెక్ట్ అయిన నాయకులు కాంగ్రెస్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది పెద్ద వాళ్లే పార్టీలోకి వస్తారని నమ్మకం ఉందని ఆయన అన్నారు.