RCB కి మరో షాక్
ఈ IPL సీజన్‌లో RCBకి మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే ఆటలో గాయాల బారినపడి పలువురు స్టార్ ప్లేయర్స్ టీమ్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో RCBకి మరో స్టార్ ప్లేయర్ కూడా దూరమయినట్లు తెలుస్తోంది. కాలి మడమకు తగిలిన గాయం కారణంగా స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ కూడా ఈ IPL సీజన్‌కు పూర్తిగా దూరమయినట్లు RCB యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కాగా అతను త్వరగా కోలుకోవాలన ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. అయితే పాటిదార్ స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. తమ నిర్ణయాన్ని RCB కోచ్,మేనేజ్‌మెంట్ అతి త్వరలోనే ప్రకటిస్తుందని ట్వీట్ చేసింది.

