వెయిట్ లాస్ కోసం అద్భుతమైన హోమ్ రెమిడీ….!
హెర్బల్ టీ అనేది ఆరోగ్యకరమైన ద్రవపదార్థం, ఇది శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపిస్తాయి, మరియు కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతుంది. ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుని, దానికి నిమ్మరసం లేదా తేనె కలుపుకొని దీన్ని రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత త్రాగండి వల్ల ఫలితాలు ఉంటాయి. పుదీనా టీ కూడా శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. తాజా పుదీనా ఆకులను మరిగించి, నీటిలో వేయండి. ఈ టీను పడుకునే ముందు త్రాగండి, పుదీనా టీ తాగడం వల్ల కడుపులో బరువు లేదా ఉబ్బరంత ఉండదు.

చామంతి టీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడి తగ్గించి మరియు కొవ్వును బర్న్ చేసే ప్రక్రియకు సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో చామంతి పువ్వులను వేయించి నీటిని మరిగించండి. ఈ టీని నిద్రపోయే సమయానికి 30-40 నిమిషాల ముందు త్రాగండి.ఇలా చెయ్యడం వల్ల కొంచం బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ హెర్బల్ టీ ని తాగవద్దు.