Home Page Sliderhome page sliderInternationalNewsPoliticsviral

భారతీయులకు అమెరిాకా భారీ ఉరట

యూఎస్ లో రెమిటెన్స్ పన్నుపై ఎన్ఆర్ఐ భారీ ఊరట
తొలిగా ప్రతిపాదించిన 5 శాతం పన్నును 1 శాతానికి తగ్గింపు
బ్యాంక్, క్రెడిట్ , డెబిట్ కార్డు లావాదేవీలకు పూర్తి మినహాయింపు
సెనెట్‌లో స్వల్ప మెజారిటీతో బిల్లుకు గ్రీన్ సిగ్నల్
‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో కీలక నిర్ణయం

అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే నగదుపై (రెమిటెన్స్‌) విధించాలని ప్రతిపాదించిన పన్నును ప్రభుత్వం తగ్గించింది. తొలుత 5 శాతంగా ఉన్న ఈ పన్నును తాజాగా ఒక శాతానికే పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన ఈ బిల్లు అమెరికా సెనెట్‌లో ఆమోదం పొందింది.

  • బ్యాంకు లావాదేవీలకు మినహాయింపు
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో ఈ రెమిటెన్స్ పన్నును చేర్చారు. ముసాయిదా ప్రకారం ఈ పన్నును ఒక శాతానికి తగ్గించారు. బ్యాంక్ ఖాతాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలకు ఈ పన్ను నుంచి పూర్తి మినహాయింపును కల్పించారు. మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల ద్వారా సొమ్ముకు ఒక శాతం పన్ను వర్తిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు.
  • తొలగిన ఆందోళన
    ఈ ఏడాది మే నెలలో ఈ పన్నును తొలిసారిగా 5 శాతం చొప్పున విధించాలని ప్రతిపాదించారు. అమెరికా పౌరులు కాకుండా హెచ్‌1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై వర్తిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం అమలైతే ఏటా వారిపై దాదాపు 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,600 కోట్లు) ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంచనాలు వెలువడ్డాయి. తాజా నిర్ణయంతో ఆ ఆందోళన తెరపడింది.