Home Page SliderNational

నిండుకుండల్లా ఆల్మట్టి- శ్రీశైలం డ్యామ్స్

ఎగువ నుండి వస్తున్న భారీ వరద ప్రవాహంతో ఆల్మట్టి, శ్రీశైలం డ్యామ్‌లు నిండుకుండల్లా తయారయ్యాయి. ఎగువన గల ఆల్మట్టి డ్యాం క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌కు 1,61,747 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా జల విద్యుత్కేంద్రాలు, గేట్ల ద్వారా 86 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ రాత్రి వరకూ అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆలమట్టి నుండి శ్రీశైలానికి 455 కి.మీ దూరం ఉంది. దీనితో మూడు రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద వచ్చి తీరుతుంది. ఆల్మట్టి దిగువన గల 31 టీఎంసీల నారాయణ పుర జలాశయం గేట్లను కూడా ఎత్తి వచ్చిన నీటిని జూరాలకు విడుదల చేస్తున్నారు. జూరాలలో జల విద్యుత్కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. రిజర్వాయర్‌లో ఖాళీ ఉండడానికి గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేసే అవకాసం ఉంది. 101 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్ర డ్యాములో ఇప్పటికే 60 టీఎంసీలకు చేరింది. ఈ విధంగా వరద వస్తే కేవలం నాలుగురోజుల్లోనే తుంగభద్ర పూర్తిగా నిండుతుంది.