Home Page SlidermoviesNational

అల్లు అర్జున్‌కి కొత్త బిరుదు ఇచ్చిన ఆర్జీవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్‌లో దుమ్ము రేపాడంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. This one looks like it will go through the STRATOSPHERE .. అల్లు అర్జున్ is the MEGAOMEGATOWERPLANETORY STAR అంటూ బన్నీకి కొత్త  బిరుదును కూడా ప్రసాదించాడు. ‘మెగామెగాట్రోప్లానిటరీ స్టార్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఆదివారం పాట్నాలో జరిగిన పుష్ప-2 ది రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. లక్షలాది మంది అభిమానులతో స్టేడియం నిండిపోయింది. అసలు ఇంతమంది వచ్చేసరికి నిర్వాహకులకే మతి పోయింది. అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాల బయట కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు.