Home Page SliderNational

విపక్ష కూటమికి నాయకురాలు సోనియాగాంధీయేనా?

Share with

నేడు బెంగళూరులో రెండవరోజు విపక్షాల భేటీ జరగనుంది. దీనికి ఛైర్ పర్సన్‌గా సోనియాగాంధీనే ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో యూపీఏ ఛైర్ పర్సన్‌గా ఉన్న సోనియా నాయకత్వంలో రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి కూడా కర్ణాటక ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ వర్గాలు రాబోయే ఎన్నికల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాల కూటమికి కొత్త పేరును కూడా ఈ సమావేశాలలో నిర్ణయించాలనుకుంటున్నారు. భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయం చేసుకుంటూ, ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేయనున్నాయి. సోనియా గాంధీని విపక్ష నేతగా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తన పార్టీలోని చీలికతో తలమునకలై ఉన్నారు. నేడు ఆయన ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది.