Home Page SliderTelangana

తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్-అతిభారీ వర్షాలు

Share with

వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రప్రజలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం బంగాళాఖాతంలో వాయువ్య ప్రాంతంలో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే జార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 8 కిలోమీటర్ల ఎత్తు వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఉంది. దీనితో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీనితో భారీవర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం, మంగళవారాలలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలలో దాదాపు 2 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.