NationalNews

అగ్నిపథం… నయా భారతపథం…

ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ఇప్పటి వరకు ఉన్న విధానాలకు భిన్నంగా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఆర్మీ, నావీ, ఎయిర్ ‌ఫోర్స్‌లో
మెరికల్లా యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. యువతకు ఉద్యోగాలివ్వాలని… యువతను దేశం కోసం నిలబెట్టాలని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు భావిస్తుంటే…విపక్షాలు
మాత్రం విద్యార్థుల్ని ఎగదోస్తున్నాయ్. ఇదంతా నాణెనానికి ఒక వైపు ఐతే నాలుగేళ్ల ఉద్యోగం ఏంటంటూ విపక్షాలు అర్థం లేని వాదనలు చేస్తున్నాయ్. వాస్తవానికి దేశానికి సేవ చేసే అవకాశం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు భారత పౌరులందరికీ కల్పించాలని మోడీ సర్కారు ఒక అసాధారణ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం ద్వారా యువతకు కొత్త ఉపాధి అవకాశంతో పాటు… దేశానికి సేవ చేసే భాగ్యమూ కలుగుతుంది. కానీ కొందరు మాత్రం కేంద్రం నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఐతే ఇదేమీ పర్మినెంట్ జాబ్ అని కేంద్రం చెప్పడం లేదు… దేశం కోసం పనిచేసేందుకు మెరికల్లాంటి యువకులను సన్నద్ధం చేసేందుకు అగ్నిపథ్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. నాలుగేళ్ల తర్వాత భవిష్యత్ ఏంటంటూ కొందరు యువకులు. బీహార్‌లోని ముజఫర్ పూర్, బక్సర్, బెగుసరాయ్‌లో పలువురు ఆందోళనకు దిగారు. ఐతే వారందరికీ అసలు విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.

అగ్నిపథ్‌కు దేశానికి ఉజ్వల భవిష్యత్ అందిస్తుంది. కానీ కేంద్రం… యువతను పక్కదోవ పట్టించకుండా ఉండేందుకు పథకం తీసుకొస్తే కొందరికి కడుపు మండుతోంది.
నాలుగేళ్ల తర్వాత పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయ వ్యక్తుల భవిష్యత్ భద్రంగా, అభేయంగా ఉండాల్సిందే. కానీ మారుతున్న కాలానికి
అనుగుణంగా పరిస్థితుల్లోనూ మార్పులు తీసుకురావాలి కదా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువత మిలటరీలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నారు. ఇన్నాళ్లు
మిలిటరీలో చేరేవారికి మాత్రమే అలాంటి అవకాశం ఉంది. అమెరికా, రష్యాలో యువత.. అక్కడ ఆర్మీలో పనిచేయడాన్ని దశాబ్దాలుగా చూస్తూన్నాం.

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ తీసుకురావడం వల్ల ఇంటర్ చదివిన తర్వాత జీవితంలో ఏదైనా సాధించాలని కలలుగనే యువతకు ఇది ఒక మేలి మలుపు అని మాత్రం చెప్పొచ్చు.
యువతలో ఉత్సాహం తీసుకొస్తే.. దేశానికి నవజవాన్లను నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఇన్నాళ్లూ యువతను తమ చెప్పుచేతల్లో ఉంచుకొని రాజకీయాలు చేసిన
నాయకులు మాత్రం భయపడిపోతున్నారు. తమ పార్టీ జెండాలు మోసేందుకు ఎవరూ ఉండరని కంగారుపడిపోతున్నారు. యువత మంచి కెరీర్ దిశగా అడుగులేస్తుంటే ఎందుకో వారిని వెనక్కిలాగాలని చూస్తున్నారు. దేశంలో భిన్న ప్రాంతాల మధ్య ఐక్యతకు అవకాశం లభిస్తోంది. ఒకరు ఉత్తరాది వారని.. మరొకరు దక్షిణాది వారని… ఒకరు కేరళవాసని, మరొకరు, తెలంగాణ వాసి అని… మరొకరు బీహార్, యూపీ వాసులన్న అభిప్రాయం చెరిగిపోతుంది. వన్ కంట్రీ అన్న ఫీలింగ్ యువతలో బలంగా పెనవేసుకుపోతుంది.
దేశంలో ఇప్పుడు ఎక్కువ శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో లభిస్తున్నాయ్. 90 శాతం ఉద్యోగాల కల్పన ప్రైవేటు రంగంలోనే జరుగుతోంది. ఇప్పుడు నాలుగేళ్లు
పనిచేశాక ఏమిస్తారని అందరూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తీసుకునే పింఛన్‌ను తీసుకోకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయ్.
గాంధీ కలలు కన్న రాజ్యం వస్తుంది. మత్తులో తూలుతున్న యువత డ్రగ్స్ వ్యసనాల బారినపడకుండా ఉంటుంది.

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ అసలు విషయాలేంటో ఓసారి పరిశీలిద్దాం… ఐతే ఇది గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్‌కు భిన్నమైనది. అగ్ని పథ్ ద్వారా సైనిక సర్వీసుల్లో చేరాలనుకునేవారికి కేంద్రం ఓ అరుదైన అవకాశం ఇచ్చింది. నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించే ఈ టీమ్ సభ్యులను అగ్నివీర్స్ అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీలో సెలక్ట్ అయినవారికి ఏ విధంగానైనా శిక్షణ ఇస్తారో వీరికి కూడా అలాంటి శిక్షణ అందిస్తారు. ఎడారి ప్రాంతాల్లో, కొండ కోనల్లో, అడవుల్లో పనిచేసేందుకు యువతకు తర్ఫీదు ఇస్తారు. నాలుగేళ్ల కోర్సుకు సెలక్ట్ అయినవారి పనితీరు ఆధారంగా… వారు సమర్థత నిరూపించుకుంటే.. సైన్యంలోనూ వివిధ హోదాల్లోనూ తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరం రూ. 4.76 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తారు. సుమారుగా నెలకు 30 వేల నుంచి 40 వేల రూపాయల మధ్య వేతనం లభిస్తుంది. నాలుగేళ్ల కోర్సుకు సెలక్ట్ అయినవారు.. రెగ్యులర్ సర్వీసుకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగో సంవత్సరం వీరికి సుమారుగా 7 లక్షల వరకు ప్యాకేజీ లభించవచ్చు. నాలుగేళ్లలో వేతనం నుంచి 5.02 లక్షల మొత్తాన్ని కార్పస్ ఫండ్ గా అభ్యర్థి నుంచి జమ చేస్తారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని కార్పస్ ‌ఫండ్‌గా జమ చేస్తుంది. నాలుగేళ్ల మిలటరీ సర్వీసు నుంచి బయటకు వచ్చే సమయంలో సేవానిధి ప్యాకేజీ కింద రూ. 11.71 లక్షల రూపాయలను అందజేస్తారు. మరో మూడు నెలల్లో ఈ కోర్సుకు సంబంధించి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. అగ్నిపథ్ కోసం సెలక్ట్ అయినవారిలో సుమారుగా 25 శాతాన్ని పర్మినెంట్ కేడర్‌గా పరిగణినించే అవకాశం ఉంది. ఆర్మీలో తీసుకున్న వారు 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగిల్సి ఉంటుంది.