Home Page SliderTelangana

“అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయం”.. మంత్రి

అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం భాషా సంస్కృతిక శాఖ – సారిప‌ల్లి కొండ‌ల రావు ఫౌండేష‌న్ – యువ‌క‌ళావాహిని-  తెలంగాణ రాష్ట్ర జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం ఆద్వ‌ర్యంలో ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన‌ ప్ర‌పంచ  జాన‌ప‌ద దినోత్స‌వ వేడుక‌ల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజ‌ర‌య్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు   దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జాన‌ప‌ద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు. కానీ ప్రస్తుతం అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని, దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.