రోడ్డుపై లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ
తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా కేంద్రంలో ఏసీబీ రెయిడ్స్ జరిగాయి. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ కు బిల్లు విషయంలో నర్సింగరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ ఉదయం కలెక్టరేట్ ఆఫీస్ ముందు రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్టర్ రూ.20వేలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.