Home Page SliderTelangana

తాగిన మత్తులో ఓ దొంగ ఏం చేశాడో తెలుసా?

ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01 జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్ లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబండించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకుని పట్టుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. పోలీసులు దొంగను విచారించగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్ అని తేలింది. దొంగ గణేశ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.