వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి జైలు శిక్ష
భూమండల రాజకీయ పెద్దన్న నివశించే అమెరికాలోని వైట్ హౌస్ పైనే దాడి చేయబోయిన మన తెలుగు సంతతికి చెందిన అమెరికావాసికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2023 మే 23న 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ అనే యువకుడు ఒక ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడి చేశాడు. జో బైడెన్‌ని తుదముట్టించేందుకు అతని ట్రక్కుతో తెగబడ్డాడు. నాజీ జెండాను పట్టుకొని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ…. అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమారుస్తానని శపథం చేస్తూ అప్పట్లో ఊగిపోయాడు.వైట్ హౌస్ భద్రతా బలగాలు ఎట్టకేలకు అతణ్ణి పట్టుకుని చెరసాలకు తరలించారు.దాదాపు 20 నెలల సుదీర్ఘ విరామానాంతరం అతనికి 8 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.


 
							 
							