నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ
ఫ్లాట్ ఫాం పై నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.ఈ ఘటన కేరళలోని మధ్య కేరళ జిల్లా నట్టిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుఝామున చోటు చేసుకుంది .సోమవారం రాత్రి చల్లగాలికి తమ పిల్లలతో ముచ్చట్లాడి ఆదమరిచి నిద్రకు ఉపక్రమించిన వారిని మృత్యు లారీ కబళించి వేసింది. శరణార్ధులు నిద్రిస్తున్న ఫ్లాట్ ఫాం పైకి అదుపు తప్పి దూసుకెళ్లింది.దీంతో ఇద్దరు చిన్నారు,ముగ్గురు పెద్దలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.శరీరాలన్నీ మాంసపు ముద్దలుగా మారిపోయాయి.మృతులంతా పొట్టకూటి కోసం వచ్చిన తమిళనాడు వాసులుగా గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది.వారిని స్థానికుల సాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.నట్టిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

