మా అమ్మాయి పరిస్థితేంటంటూ పవన్‌కి లేఖ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్..తీరా అధికారంలోకి వచ్చాక అందులో ఒక్క అమ్మాయిని కూడా వెతికి తీసుకురాలేకపోయారు.ఈ నేపథ్యంలో కాకినాడలో జరిగిన ఓ ఘటన తాలుక బాలిక తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కి గురువారం లేఖ రాశారు. తన కూతురు ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక అదృశ్యం అయ్యిందని దీనికి సంబంధించి సెప్టెంబర్ 22న సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చామని అయినా ఆచూకి తెలియలేదని పవన్ కళ్యాణ్‌కి లేఖ రాశారు.ఎలాగైనా తన కుమార్తెను వెతికి పెట్టాలని కోరడంతో పవన్ కళ్యాణ్ పై నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు.