ఫోన్ వాడొద్దని మందలించినందుకు బాలుడు సూసైడ్
మొబైల్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని వారించినందుకు ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులకు విడాకులు కావడంతో విశాఖ అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో తాత, అమ్మమ్మ ఇంటి వద్ద ఓ బాలుడు ఉంటున్నాడు. ఆ పిల్లవాడు ఎక్కువగా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ గంటల తరబడి ఆడుతుండేవాడు. హర్రర్ సినిమాలు చూస్తుండేవాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఫోన్ వాడొద్దని మందలించారు. దీనికి ఆ 13 ఏళ్ల బాలుడు షూలేస్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తాతయ్య ఫిర్యాదు మేరకు విశాఖ లోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

