వేగంగా ఢీకొట్టిన కారు…మహిళ స్పాట్ డెడ్
కర్ణాటకలోని చిత్రదుర్గ ఎక్స్‌ప్రెస్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డు దాటేందుకు యత్నించింది. రాత్రివేళ కావడంతో రోడ్డు దాటుతున్న వారు వాహనదారులకు కనిపించలేదు. దీంతో అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె గాలిలోకి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

