నేను పార్టీ మారడం లేదు
రాజకీయ పార్టీలన్నాక ఎత్తుపల్లాలుంటాయని అంత మాత్రన వైసీపి పనైపోయినట్లు కాదని రాజ్యసభ ఎంపి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు.మంగళవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదన్నారు.తమ పార్టీలో అన్నీ సవ్యంగా జరిగితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపియే గెలిచుండేదన్నారు .పార్టీలో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుకుని ముందుకుసాగుతామని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఆయన వ్యక్తిగతమన్నారు.జీవితంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు గానీ,ఇతరుల ఒత్తిళ్లకుగానీ విజయసాయిరెడ్డి లొంగిపోలేదన్నారు.