Home Page SliderPoliticsTelanganatelangana,

‘ఫార్ములా- ఈ -కార్ రేస్’ కేసులో కేటీఆర్‌కు ఊరట

బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఊరట లభించింది. ఆయన అరెస్టు కాకుండా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ నెల 31 వరకూ పొడిగించింది. ఈ కేసులో కేటీఅర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కూడా అప్పటికి వాయిదా వేసింది.  ఈ కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. గతంలో అరెస్టు చేయకుండా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.