Home Page SliderTelangana

రేవతి భర్తకు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తాం..

సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని FDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు చెప్పారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడం వల్ల హాస్పిటల్ కు వెళ్లలేక పోయానని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి ఇండస్ట్రీకి సహకారం ఉంటుందని సీఎం చెప్పారని వివరించారు. శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని చెప్పారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అందరం త్వరలోనే సీఎంను కలుస్తామని వివరించారు.