Breaking NewsHome Page SliderSpiritual

కొడ‌కా అల్లు అర్జున్ ఆంధ్రోడివి ఆంధ్రోడిలా ఉండు

సినీ న‌టుడు అల్లు అర్జున్ ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చిక్కిందే ఛాన్స్ క‌దా అని ఓ ఆటాడుకుంటున్నారు.ఇష్టారీతిన బూతుల‌తో విరుచుకుప‌డుతున్నారు.ఓ వైపు గాంధీ భ‌వ‌న్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నోళ్ల‌కు ప‌ని చెబుతూనే ఉన్నారు.తాజాగా మంగ‌ళ‌వారం నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అల్లు అర్జున్ పై నోరు పారేసుకున్నారు. ” కొడ‌కా అల్లు అర్జున్‌.ఆంధ్రోడివి ఆంధ్రోడిలా ఉండు.మా సీఎం రేవంత్ రెడ్డిని తిడితే నీ సినిమాలు తెలంగాణాలో అడ‌నివ్వం. ప‌గ‌టి వేషాలేసుకుని బ‌త‌క‌డానికి వ‌చ్చావ్‌.అలానే బ‌తుకు.అస‌లు మీ సినిమా వాళ్లు తెలంగాణ‌కు ఏం చేశారు ” అంటూ తీవ్ర‌మైన ప‌రుష ప‌ద‌జాలంతో ధ్వ‌జ‌మెత్తారు.